సైంటిస్ట్‌లు గతంలో అందుబాటులో ఉన్న సాంకేతికతతో సుమారు 2.7–2.8 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం పుట్టిందని అంచనా వేశారు. అయితే.. ఇప్పుడు ఏఐ వల్ల ఆ కాలం మరో 600 మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్లింది.
ఆస్ట్రేలియాలోని పిల్బరా క్రాటన్ ప్రాంతంలో దొరికిన 3.3 బిలియన్ సంవత్సరాల నాటి శిలల లోపల జీవులకు సంబంధించిన కెమికల్స్ ఉన్నట్టు సైంటిస్ట్‌లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను ఉపయోగించారు.
కర్టిన్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా), ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల ఫ్రొఫెసర్లు చేసిన ఈ రీసెర్చ్‌లో గూగుల్ డీప్‌మైండ్ డెవలప్ చేసిన ప్రత్యేక ఏఐ మోడల్ ‘‘జియో కెమ్ నెట్” కీలక పాత్ర పోషించింది. ఇలాంటి శిలల్లో రసాయన సమ్మేళనాలు అతి సూక్ష్మ స్థాయిలో ఉంటాయి.
సంప్రదాయ పద్ధతులతో అందులోని ఆ ఆధారాలను గుర్తించడం చాలా కష్టం. కానీ.. ఏఐ మాత్రం ఈజీగా గుర్తించింది. అందుకోసం ఏఐకి 4.7 లక్షలకు పైగా పురాతన శిలల డేటాతో ట్రైనింగ్ ఇచ్చారు. సైంటిస్ట్‌లు18 నెలల్లో చేసే విశ్లేషణను ఇది కేవలం 11 రోజుల్లో పూర్తి చేసింది.
