- ఎప్పట్లాగే మరో తేదీని ప్రకటిస్తారా?: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. నెల రోజుల్లోపు సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభిస్తామని గత నెల 23న ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు నెలవుతున్నా ప్రారంభిస్తారా లేదా అని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన నిలదీశారు.
ఎప్పటిలాగే వైద్యసేవల ప్రారంభానికి మరో తేదీని ప్రకటిస్తారా అని ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు.
