బీసీల రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండి : బీసీ సంఘాల నాయకులు

బీసీల రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండి : బీసీ సంఘాల నాయకులు

టేకులపల్లి, వెలుగు : బీసీల రిజర్వేషన్ల అమలు కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, బంద్‌కు మద్దతు తెలపాలని నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చొరవ చూపాలని కోరారు. 

బంద్‌ రోజున వ్యాపార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలన్నారు. కార్యక్రమంలో టేకులపల్లి మండల బీసీ కుల సంఘాల నేతలు నర్సింగ్ లక్ష్మయ్య, మావునూరి రమేశ్, తౌడోజు భిక్షమయ్య, గాడేపల్లి రాములు, చిర్రా వెంకటయ్య, డోర్నాల శ్రీను, లక్కినేని వెంకన్న, కట్టుకొజ్వల సురేశ్, ఉరిమెళ్ల యదాచారి, అనంతుల వెంకన్న, పి.హరినాథ్ బాబు, లక్కినేని వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు, ఎన్.కోటయ్య తదితరులు పాల్గొన్నారు.