
హైదరాబాద్నగరంలో బీసీ బంద్ తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సిటీలో అన్ని డిపోల్లో బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగలకు వెళ్లే ప్రజలకు బస్సులు లేకపోవడంతో ప్రైవట్ ఆటోలు, క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు.
బీసీ బంద్సందర్భంగా ఉప్పల్ రింగు రోడ్డు దగ్గర ప్రైవేట్ క్యాబ్డ్రైవర్లు అధిక ఛార్జీల దందా చేశారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు ప్రయాణికుల నుంచి సాధారణ రేట్లకంటే అధికంగా డబుల్ ఛార్జీలను వసూలు చేశారు. 300 రూపాయలు ఛార్జీ ఉండగా.. 700లకు పైగా వసూలు చేస్తున్నారు. ఒక్క ఉప్పల్ రింగు రోడ్డులోనే కాదు.. ఎల్బీనగర్, సాగర్రింగ్రోడ్డు, సీబీఎస్ బస్ స్టేషన్ల దగ్గర ఊళ్లకు వెళ్లే ప్రయాణికులనుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.