
ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను సక్సెస్చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ నుంచి ఓయూ మీదుగా గన్ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు.
18న తలపెట్టిన బంద్‌కు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. జిల్లా, మండల కేంద్రాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, బీసీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించాలన్నారు. కార్యక్రమంలో గువ్వల భరత్ కుమార్, గుజ్జ సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు సిద్ధం కండి: దాసు సురేశ్
బీసీల రాష్ట్ర బంద్ కు సిద్ధం కావాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 15 నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో రెండు రోజుల పాటు 42 శాతం రేజర్వేషన్ల సాధన కోసం చర్చ నిర్వహించాలని సూచించారు. 17న రాజ్యాంగ సవరణ కోసం అంబేద్కర్ విగ్రహాల వద్ద రాష్ట్ర వ్యాప్త అభ్యర్థన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా సట్ల ప్రభాకర్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.