బీసీ సీఎం బీజేపీతోనే సాధ్యం : లక్ష్మణ్

బీసీ సీఎం బీజేపీతోనే సాధ్యం : లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: బీసీని సీఎం చేసుడు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ, నేషనల్ ఓబీసీ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ అన్నారు. గురువారం లింగోజిగూడ డివిజన్​లో నిర్వహించిన కుమ్మరుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీలకు  న్యాయం జరగాలన్నా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు న్యాయం జరగాలన్నా.. అది బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే అన్ని వర్గ ప్రజలకు సామాజిక న్యాయం చేయగలదన్నారు. అందుకే బీజేపీ  తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికి, చిన్న కులాలు కూడా పాలనలో భాగసామ్యం అయ్యేలా మోదీ సర్కారు కృషి చేస్తోందని అన్నారు.