అక్రమ అరెస్టులపై బీసీ కమిషన్ సీరియస్

అక్రమ అరెస్టులపై బీసీ కమిషన్ సీరియస్
  • కరీంనగర్, హనుమకొండ సీపీలకు నోటీసులు

హనుమకొండ, వెలుగు: హుజూరాబాద్ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో నలుగురిని అరెస్టు చేయడంపై నేషనల్ బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది. అరెస్టుపై ఐదు పని దినాల్లో నివేదిక సమర్పించాలని కరీంనగర్, వరంగల్ సీపీలకు నోటీసులు ఇచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఓ ప్రజాప్రతినిధిపై తప్పుడు పోస్టులు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారనే కారణంతో ఈ నెల 17న కమలాపూర్ మండలానికి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండారి సదానందం, వడ్డే రమేశ్, కారట్లపల్లి వసంత్ రావు, కడారి వెంకటేశ్​ అనే నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వసంత్ తండ్రి కారట్లపల్లి దశరథం పోలీసుల తీరుపై నేషనల్ బీసీ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. సీరియస్ గా తీసుకున్న కమిషన్ ​సోమవారం సాయంత్రం కరీంనగర్, వరంగల్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. నివేదిక సమర్పించకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసులు ఇష్యూ చేసిన అనంతరం నలుగురిని బెయిల్ పై విడుదల చేయడం గమనార్హం.