
హైదరాబాద్, వెలుగు: 2025–-26 విద్యా సంవత్సరానికి బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు సెక్రటరీ సైదులు తెలిపారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించినట్టు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ లేదా mjptbcwreis.telangana.gov.in ద్వారా విద్యార్థులు సీట్ల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. సీట్లు దక్కిన విద్యార్థులు వచ్చే నెల 6లోగా ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుందన్నారు.