నేషనల్ ఫెన్సింగ్ పోటీల్లో ..బీసీ గురుకుల విద్యార్థులకు మెడల్స్

నేషనల్ ఫెన్సింగ్ పోటీల్లో ..బీసీ గురుకుల విద్యార్థులకు మెడల్స్
  • మంత్రి పొన్నం, సెక్రటరీ సైదులు అభినందనలు

హైదరాబాద్, వెలుగు: నేషనల్  ఫెన్సింగ్  అసోసియేషన్  ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ 17  పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో బీసీ గురుకుల పాఠశాల స్టూడెంట్ల 11 మంది పాల్గొన్నారు. సురేఖ వెండి పతకం, రాణి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా మెడల్స్  సాధించిన స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో అభినందించారు. 

క్రీడా ప్రపంచానికి తెలంగాణ వేదిక కావాలన్న ప్రభుత్వ ఆలోచనను  బీసీ గురుకుల విద్యార్థులు అనుసరిస్తూ క్రీడా పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడా స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందిస్తూ వారి ఆసక్తికి అనుగుణంగా శిక్షణ అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.