బీసీ చేతివృత్తుల మేళాకు ఫుల్ రెస్సాన్స్ :ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్

బీసీ చేతివృత్తుల మేళాకు ఫుల్ రెస్సాన్స్ :ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్
  • సెలవురోజు భారీగా వచ్చిన విజిటర్స్
  • ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ గ్రౌండ్ లో కొనసాగుతున్న బీసీ చేతివృత్తుల మేళాకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఆదివారం జంటనగరాల నుంచి విజిటర్స్ భారీగా తరళివచ్చి మేళాలో ఉన్న వస్తువులను కొనుగోలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన కులవృత్తులను భావితరాలకు అందించాలని లక్ష్యంతో ఈ మేళా ఏర్పాటు చేసినట్లు ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ తెలిపారు.  స్థానిక హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడంలో ఈ మేళా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఆషాఢ బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సేల్ లో బోనాల పండుగకు అవసరమైన వస్తువులను ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించాలని ఆయన పిలపునిచ్చారు.మొత్తం 60 స్టాళ్లతో 15 రోజుల పాటు కొనసాగుతున్న ఈ మేళాలో బీసీ వర్గాలకు చెందిన కళాకారులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి జీవనోపాధికి చేయూతనందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ కులవృత్తుల పరిరక్షణ, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అలోక్ కుమార్ తెలిపారు.