కామారెడ్డి జిల్లాలో బీసీ ద్రోహుల దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి జిల్లాలో  బీసీ ద్రోహుల దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం బీసీ జేఎసీ ఆధ్వర్యంలో  బీసీ ద్రోహుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బీసీల పట్ల మొండి వైఖరి వీడాలన్నారు. 

బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్,  రాజయ్య, మల్లయ్య,  హజీజ్,  రాజీవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.