బీసీ రిజర్వేషన్ల అమలుకు.. రాజ్యాంగ సవరణే పరిష్కారం : భిక్షపతి

బీసీ రిజర్వేషన్ల అమలుకు..  రాజ్యాంగ సవరణే పరిష్కారం : భిక్షపతి
  • బీసీ జేఏసీ జిల్లా చైర్మన్​ భిక్షపతి 

ములుగు, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణే పరిష్కారమని బీసీ జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల భిక్షపతి అన్నారు. గురువారం ములుగులోని అంబేద్కర్​ విగ్రహం వద్ద బీసీ జేఏసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్​ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్​చేశారు. 

రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. బీసీల 42 శాతం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్​బీసీ ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్​చేశారు. రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన భిక్షపతిగౌడ్, బీసీ జేఏసీ నాయకులు రామంచి ప్రతాప్, కందకట్ల సారయ్య, యేశబోయిన సాంబయ్య యాదవ్, వీరబాబు, జంపన్న పాల్గొన్నారు.