గాంధీ భవన్ ముట్టడికి బీసీ నేతల యత్నం

గాంధీ భవన్ ముట్టడికి బీసీ నేతల యత్నం
  • కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఖరారుపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. రిజర్వేషన్లలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం గాంధీ భవన్ ఎదుట బీసీ జేఏసీ నేతలు గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, శేఖర్ సగర, వీర స్వామి ఆందోళన చేపట్టారు.

 గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు బయట బైఠాయించారు. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మరోవైపు, బీసీ రిజర్వేషన్లపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.