మార్చి 1 నుంచి బీసీ మహా పాదయాత్ర

మార్చి 1 నుంచి  బీసీ మహా పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం, హిందూ బీసీ మహాసభ, ఏఐఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 1 నుంచి బీసీ పాదయాత్రను నిర్వహించనున్నారు. పండుగ సాయన్న జన్మస్థలమైన మిర్గాన్ పల్లె నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మస్థలమైన కిలాషాపూర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను హైదరాబాద్ గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. యాత్రను విజయవంతం చేయాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.