42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : బీసీ పొలిటికల్ ఫ్రంట్

42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి :  బీసీ పొలిటికల్ ఫ్రంట్

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్​లో చట్టబద్ధత కల్పించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ డిమాండ్ ​చేశారు. ఆదివారం  హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో కన్వీనర్ ​అయిలి వెంకన్న గౌడ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్  బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వలేనివారు చట్టసభల్లో ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  బీసీలంతా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.  బీసీల్లో మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్​లు ఉండగా అగ్ర కులానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. నేతలు విజయ్​ కుమార్ గౌడ్, దుర్గయ్య గౌడ్, నారాయణ గౌడ్, శేఖర్ పాల్గొన్నారు.