అంకం రాహుల్ మృతిపై విచారణ జరపాలి: బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్

అంకం రాహుల్ మృతిపై విచారణ జరపాలి: బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతిపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​డిమాండ్ చేశారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్​ది హత్యో, ఆత్మహత్యో  ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 

ఇప్పటికీ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకపోవడానికి గల కారణాలను కూడా చెప్పాలని కోరారు. హైదరాబాద్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​నైతిక బాధ్యత వహించాలని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించి, విచారణ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

బాధిత కుటుంబానికి కళాశాల యాజమాన్యం రూ.కోటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోటి పరిహారం చెల్లించాలని కోరారు. నాయకులు పోశాల సరస్వతి, మాకాని నాగజ్యోతి , చిక్క దేవదాస్ , మంద వెంకటస్వామి , మంద ఈశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.