బీజేపీ​ఆర్థిక అసమానతలను పెంచుతోంది ; బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్

బీజేపీ​ఆర్థిక అసమానతలను పెంచుతోంది ; బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘అత్త సొమ్ము అల్లుడి దానం’లా ఉందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్​విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ దేశంలో ఆర్థిక అసమానతలు, అస్థిరతను పెంచుతోందని మండిపడ్డారు. యూనియన్​బడ్జెట్​పై బుధవారం బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో మేధావులు, బీసీ, మహిళా సంఘాల నాయకులతో ఆయన విశ్లేషణ చేపట్టారు.

దాసు సురేశ్​మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక విధానాలు పేదవాడి నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు. మౌలిక వసతులు, గ్రామీణ రోడ్లు, ఉద్యోగులు, ఆసరా పేరుతో దేశ సంపదను కార్పొరేట్​కంపెనీలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ఆర్థిక గణాంకాలు ఇంత దయనీయంగా ఉంటే అమృతకాల బడ్జెట్ ఎలా అవుతుందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్​అట్టడుగుల వర్గాలపై తీవ్రమైన వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.  బీసీ ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ, నారగోని, బండారు పద్మావతి, దీపిక, తాళ్లపాక భాగ్యలక్ష్మి, శ్రీమాన్ పాల్గొన్నారు.