ముషీరాబాద్, వెలుగు: 19వ శతాబ్దంలోనే సామాజిక అసమానతలను రూపుమాపి, అంటరానితనం నిర్మూలనకు చట్టం చేసిన తొలి భారతీయ చక్రవర్తి సాహూ మహారాజ్ అని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. కొల్హాపూర్ సంస్థానాధీశుడు, ఛత్రపతి శివాజీ దత్తపుత్రుడు సాహూ మహారాజ్ జయంతిని బుధవారం బాగ్ లింగంపల్లి లోని బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.
సాహూ మహారాజ్ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే సాహూ మహారాజ్ కు అసలైన నివాళి అందుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటుతో రేవంత్ ప్రభుత్వం సాహూ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు.
