- ఈ ఎన్నికల్లో ఒక్కటే
- జనరల్ మహిళకు ఒకటి నుంచి మూడుకు పెంపు
యాదాద్రి, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. గత ఎన్నికల కంటే ఈసారి చైర్మన్ల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు తగ్గిపోయాయి. ఆ స్థానంలో జనరల్మహిళలకు పెరిగాయి. 2011 జనాభా ప్రాతిపదికతో ఎస్సీ, ఎస్టీలకు గతేడాదిలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా డెడికేషన్కమిషన్ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియను ఆఫీసర్లు నిర్వహించారు. దీంతో 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్ల కంటే ఈసారి బీసీలకు తగ్గిపోయాయి.
యాదాద్రిలో బీసీలకు తగ్గినయ్
యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి. 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఐదు చైర్మన్ సీట్లు బీసీలకు, ఒకటి ఓసీ మహిళకు రిజర్వ్అయ్యాయి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లలో డ్రా తీయగా.. రెండు మున్సిపాలిటీలు మహిళలకు దక్కాయి. దీంతో ఆరు మున్సిపాలిటీల్లో 3 చైర్మన్ స్థానాలు మహిళలకు దక్కినట్టైంది. ఎస్సీ, ఎస్టీలు కౌన్సిలర్ స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ రిజర్వేషన్లలో బీసీలకు కోతపడింది.
గత ఎన్నికల్లో బీసీలకు ఐదు చైర్మన్లు రిజర్వేషన్అయితే.. ఇప్పుడు బీసీలకు ఒక్క చైర్మన్ మహిళకు రిజర్వ్అయింది. మిగిలిన వాటిలో జనరల్, ఎస్సీ మహిళ, మూడు జనరల్ మహిళలకు రిజర్వ్అయ్యాయి. ఇక వార్డుల విషయానికొస్తే గతంలో బీసీలకు 33, ఎస్సీలకు14, ఎస్టీలకు 6, జనరల్‌కు 53 అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు రెండు తగ్గి 31కి పరిమతమయ్యాయి.
ఎస్సీ మహిళకు ఫస్ట్ టైమ్
2020 ఎన్నికల కంటే ఈసారి మహిళలకు చైర్మన్రిజర్వేషన్లలో వాటా పెరిగింది. గత ఎన్నికల్లో రెండు జనరల్మహిళ, ఒకటి బీసీ మహిళకు రిజర్వ్అయ్యాయి. జిల్లాలో ఈసారి ఎస్సీ మహిళకు మోత్కూరు రిజర్వ్అయింది. బీసీ మహిళకు ఒకటి, మూడు మున్సిపాలిటీలలో జనరల్ కోటాలో మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
