
- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు అధికార పక్షం రాష్ట్రపతితో భేటీ, పార్లమెంటులో బిల్లు పెట్టేలా ఒత్తిడి
- పార్టీ పరంగా 42% ఇస్తామన్న బీజేపీ రాంచందర్ రావు
- ఆగస్టు 8న కరీంనగర్ లో బీఆర్ఎస్ బీసీ శంఖారావం 72 గంటల దీక్షకు ఎమ్మెల్సీ కవిత సన్నాహాలు
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ బీసీల చుట్టే తిరుగుతున్నా యి. ఎవరికి వారు బీసీ చాంపియన్లం మేమంటే మేమని చెప్పుకుంటున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కార్డును ఉపయో గించుకొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, భారత జాగృతి పోటీ పడుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహలకు పదును పెడుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేప ట్టింది. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ బిల్లు రాష్ట్రపతికి చేరింది. స్థానిక సంస్థల ఎన్ని కల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను సవరించింది. ఇది కూడా కేంద్రానికి చేరింది.
కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ నెల 5,6,7 తేదీల్లో ఢిల్లీలో ఆందోళనకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఆగస్టు 5న పార్లమెంటులో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని, 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని, 7న రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయిచింది. సరిగ్గా అదే తేదీల్లో 72 గంటల దీక్షకు దిగనున్నట్టు భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించా రు. ఇవాళ ఉదయం దీక్షకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అక్కడ ఏ మాత్రం కదలిక వచ్చినా బీసీ రిజర్వేషన్లు తన విజయమని చెప్పుకొనేందుకే కవిత దీక్షకు దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని, ముస్లింలను బీసీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.
తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టడం సాధ్యం కాదని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వే షన్లు యాబై శాతం మించొద్దని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చిం దని చెబుతూనే తాము బీసీల పక్షమని అం టున్నారు. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము 42% రిజర్వేషన్లు ఇస్తా మని చెప్పారు. బీసీల విషయంలో తమకే చిత్తశుద్ధి ఉందని అంటున్నారు.
మొన్నటి వరకు బీసీల అంశాన్ని పెద్దగా పట్టించుకో నిబీఆర్ఎస్ మీడియాకు ఒక లీక్ ఇచ్చింది. ఇంత కాలం నోరు మెదపని కారు పార్టీ సడెన్ గా ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ లో బీసీలకు మద్దతుగా బీసీ శంఖారావం నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. నిన్న ఫాంహౌస్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారని, బనకచర్లతో పాటు బీసీల రిజర్వేషన్లపై చర్చించాలని నిర్ణయించారంటూ మీడియాకు లీకులు వచ్చాయి.
అదే సమయంలో పార్టీలోని బీసీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బీసీ శంఖారావం తేదీని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు. ఇటు ప్రజాక్షేత్రంలో పోరాడుతూ నే కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని గులాబీ నేతలు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో పోరాటం కోసం వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీ రిజర్వేషన్లతోనే తిరిగి రావాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరు గుతున్నాయి. స్థానిక సంస్థల్లో పాగా కోసమే పార్టీలు బీసీల జపం చేస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఎవరు చాంపియన్ గా నిలుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.