బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలవాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలవాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: లోకల్​ బాడీస్​ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి సీఎం రేవంత్​రెడ్డి దేశానికి మార్గదర్శిగా నిలవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య సూచించారు. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 14 బీసీ సంఘాల సమాశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది.

 ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారాలు వినియోగించకుండా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సుప్రీం కోర్టులో మాండమస్ పిటిషన్ వేయాలని సలహా ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు.