ఫిబ్రవరి 28న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

ఫిబ్రవరి 28న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

బషీర్​బాగ్, వెలుగు: దేశంలో జరగబోయే జన గణనతోపాటు కుల గణన కూడా చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై శక్రవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ గౌర్ హాల్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల హక్కులు, రిజర్వేషన్లకు మద్దతుగా నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  ప్రారంభిస్తారన్నారు.

హిమాయత్ నగర్ మక్దూం భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి, కడియాల సురేశ్ తో కలిసి ఆయన మాట్లాడారు. కుల, జన గణన ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.  రౌండ్ టేబుల్ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ వై. ప్రభంజన్ యాదవ్ , బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ హాజరవుతారన్నారు.