విశ్వ కర్మీయులు నాయకులుగా ఎదగాలి

విశ్వ కర్మీయులు నాయకులుగా ఎదగాలి
  • 75ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఒకే కులం ఆధిపత్యం ఉండడం బాధాకరం
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: విశ్వ కర్మీయులు నాయకులుగా ఎదగాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ పిలుపునిచ్చారు. 75ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఒకే కులం ఆధిపత్యం ఉండడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య పెరగాలని.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలు ఊరురా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని భరించం’ చలో సిరిసిల్ల.. విశ్వకర్మీయుల ఆత్మగౌరవ సదస్సు జరిగింది.

ఈ సదస్సులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ మాట్లాడుతూ... కేటీఆర్  గోడలు కూల్చి, కేసీఆర్ గడీలు కూలగొట్టాలన్నారు.  విశ్వ కార్మికుల ఆత్మ గౌరవ సభ జరగవద్దంటూ పోలీసులతో  అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. విశ్వ కర్మీయులు మంచి మానవత్వానికి పేరని.. అయితే కేటీఆర్ అహంకారంతో చేసిన వ్యాఖ్యల వల్ల విశ్వ కర్మీయులంతా ఒక్కటయ్యారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. 75ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఒకే కులం ఆధిపత్యం ఉండడం బాధాకరమన్నారు. విశ్వకర్మీయులు కేవలం కార్మికులుగానే కాదు...భవిషత్తు లో రాజకీయంగా ఎదుగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఒకరకంగా కేటీఆర్ కేటీఆర్ అహంకారానికి మనమే కారణం,  మనం కేవలం ఓట్లు వేసే యంత్రాలు కాకూడదన్నారు. జయశంకర్ సార్, శ్రీకాంత్ చారిలను అవమానించారని ఆయన విమర్శించారు. జయశంకర్ సార్  విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్, పూలే విగ్రహాల మాదిరిగానే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలను ఊరురా ఏర్పాటు చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.