మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి ..ఆర్ కృష్ణయ్య డిమాండ్

మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఇవ్వాలి ..ఆర్ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు. 

విద్యానగర్ బీసీ భవన్​లో ఆదివారం జరిగిన బీసీ మహిళా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయం, సబ్ కోటా విషయంలో ప్రజాప్రతినిధులను మాట్లాడాలని కోరారు. మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి పద్మ, రమాదేవి, అనురాధ  పాల్గొన్నారు.