పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే.. బీజేపీదే బాధ్యత : జాజుల శ్రీనివాస్ గౌడ్

పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే.. బీజేపీదే బాధ్యత : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ సంక్షేమ సంఘంజాతీయ అధ్యక్షుడు జాజుల 

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల పిటిషన్​ను హైకోర్టు కొట్టేస్తే బీజేపే పూర్తి బాధ్యత వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  అన్నారు.  బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 33 జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పూలే, అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్​లోని అంబర్​పేటలో ఉన్న మహత్మా 
జ్యోతిబాపూలే విగ్రహం ముందు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు.