బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను విరమించుకోవాలి :గుజ్జ సత్యం

బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను విరమించుకోవాలి :గుజ్జ సత్యం

 

  •     బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం 

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డర్‌‌ను హైకోర్టులో సవాల్​ చేసిన రెడ్డి జాగృతి పిటిషన్‌‌ను వెంటనే విరమించుకోవాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలకు రెడ్డి సమాజం సహకరించవద్దన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఆయన మాట్లాడారు. 

అగ్రకులాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఎవరూ అడ్డుపడలేదని గుర్తు చేశారు. తాము ప్రభుత్వంతో పోరాడి 42 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నామన్నారు. బీసీలపై రెడ్డి సామాజిక వర్గానికి చిత్తశుద్ధి ఉంటే, రెడ్డి జాగృతి నాయకులను ఒప్పించి పిటిషన్‌‌ను ఉపసంహరించుకునేలా చేయాలని సవాల్​ విసిరారు.