
న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)తో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఐపీఎల్–2020 సీజన్‌కు గాను ఒప్పందం నుంచి తప్పుకోవాలని గురువారం వివో నిర్ణయించుకుంది. ఈ విషయం గురించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన తమ పార్ట్‌నర్‌షిప్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించాయని స్టేట్‌మెంట్‌లో బోర్డు వెల్లడించింది. వచ్చే నెల 19న మొదలవనున్న ఐపీఎల్ ఈ సీజన్ నవంబర్ 10న ముగియనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.