బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్.. పంత్కు ప్రమోషన్.. జడేజాకు మళ్లీ జాక్పాట్

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్.. పంత్కు ప్రమోషన్.. జడేజాకు మళ్లీ జాక్పాట్

2024-25 సీజన్కు గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు A+ కేటగిరీలో చోటు దక్కింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 2023-24 సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు ఈసారి అవకాశం దక్కింది.

గ్రేడ్ ‘బీ’ లో శ్రేయాస్ అయ్యర్, గ్రేడ్ ‘సీ’ లో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారు. ఇక.. గ్రేడ్ ‘ఏ’కు మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, హార్థిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఎంపిక కావడం గమనార్హం. ‘గ్రేడ్’ సీలో టీమిండియా యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ 2024-25 హైలైట్స్:
* శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కమ్ బ్యాక్
* రిషబ్ పంత్కు ప్రమోషన్.. ‘బీ’ కేటగిరీ నుంచి ‘ఏ’ కేటగిరీకి మార్పు
* సెంట్రల్ కాంట్రాక్టు నుంచి శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ ఔట్
* అంతర్జాతీయ క్రికెట్ నుంచి అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించని బీసీసీఐ
* A+ గ్రేడ్లో నలుగురు, A గ్రేడ్లో ఆరుగురు, B గ్రేడ్లో ఐదుగురు, C గ్రేడ్కు 19 మంది క్రికెటర్లను ఎంపిక చేసిన బీసీసీఐ

Also Read : ప్రతీకార పంజా.. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆర్సీబీ రివెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రేడ్ ‘బీ’:
* సూర్యకుమార్ యాదవ్
* కుల్దీప్ యాదవ్
* అక్సర్ పటేల్
* యశస్వి జైశ్వాల్
* శ్రేయాస్ అయ్యర్

గ్రేడ్ ‘సీ’:
* రింకు సింగ్
* తిలక్ వర్మ
* రుతురాజ్ గైక్వా్డ్
* శివం దూబే
* రవి బిష్ణోయి
* వాషింగ్టన్ సుందర్
* ముకేష్ కుమార్
* సంజూ శాంసన్
* అర్ష్ దీప్ సింగ్
* ప్రసీద్ కృష్ణ
* రజత్ పటిదార్
* ధృవ్ జురెల్
* సర్ఫరాజ్ ఖాన్
* నితీష్ కుమార్ రెడ్డి
* ఇషాన్ కిషన్
* అభిషేక్ శర్మ
* అక్ష్ దీప్
* వరుణ్ చక్రవర్తి
* హర్షిత్ రాణా

ఇక.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల వార్షిత వేతనం విషయానికొస్తే.. ‘A+’ గ్రేడ్ క్రికెటర్లకు రూ.7 కోట్ల శాలరీ, గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టుకు అర్హత సాధించాలంటే ఒక సంవత్సరంలో కనీసం మూడు టెస్ట్ మ్యాచులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.