బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్

బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్

టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ గా ఎన్నికయ్యారు.  ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ లో ప్రకటించింది. భారతీయ టెలివిజన్ నెట్‌వర్క్ తనపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో చేతన్ శర్మ పదవీ విరమణ చేసిన తర్వాత 2023 ఫిబ్రవరి నుండిచీఫ్ సెలక్టర్ పోస్ట్ ఖాళీగా  ఉంది. 

ఈ నేపథ్యంలో 45 ఏళ్ల అగార్కర్ తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ.  శివ సుందర్ దాస్ , సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్‌లతో కూడిన భారత పురుషుల ఎంపిక ప్యానెల్‌లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ గా వ్యవహరించనున్నారు.  

 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో అగార్కర్ కీలక బౌలర్. 45 ఏళ్ల అగార్కర్ 26 టెస్టులు, 191 వ‌న్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 58 వికెట్లు, వ‌న్డేల్లో 288 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన అగార్కర్ 29 వికెట్లు తీశారు.