బీసీసీఐ టార్గెట్‌‌‌‌ 8 వేల కోట్లు!

బీసీసీఐ టార్గెట్‌‌‌‌ 8 వేల కోట్లు!

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్ల కాలంలో స్వదేశంలో జరిగే మ్యాచ్‌‌‌‌లపై భారీ ఆదాయాన్ని ఆర్జించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు టీవీ, డిజిటల్‌‌‌‌ రైట్స్‌‌‌‌ ద్వారా రూ. 8200 కోట్లు రాబట్టాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. మార్చి 2028 వరకు ఇండియా స్వదేశంలో 88 మ్యాచ్‌‌‌‌లు జరగనున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌‌‌‌లు (5 టెస్ట్‌‌‌‌లు, 6 వన్డేలు, 10 టీ20), ఇంగ్లండ్‌‌‌‌తో 18 మ్యాచ్‌‌‌‌లు (10 టెస్ట్‌‌‌‌లు, 3 వన్డేలు, 5 టీ20), మిగతా దేశాలన్నింటితో కలిపి 25 టెస్ట్‌‌‌‌, 25 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది. 

దీంతో 2023–మార్చి 2028 వరకు ఈ మొత్తం మ్యాచ్‌‌‌‌ల ద్వారా బిలియన్‌‌‌‌ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని బీసీసీఐ లెక్కలు వేస్తోంది. గత ఐదేళ్ల కాలానికి (2018–23) బీసీసీఐ రూ. 6138 కోట్లు ఆర్జించింది. టీవీ, డిజిటల్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కింద స్టార్‌‌‌‌ ఇండియా ఒక్కో మ్యాచ్‌‌‌‌కు 60 కోట్లు ముట్టజెప్పింది. అయితే ఐపీఎల్‌‌‌‌ మాదిరిగా ఈసారి టీవీ, డిజిటల్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కోసం వేర్వేరుగా బిడ్స్‌‌‌‌ను ఆహ్వానించింది. దీంతో ఒక్కో మ్యాచ్‌‌‌‌కు దాదాపు రూ. 90 కోట్లపైనే ఆదాయం 
సమకూరనుంది.