
అండర్ -19 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, బీసీసీఐ అధికారులు ప్లేయర్లను సత్కరించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా సమక్షంలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో అండర్ -19 టీమ్ ను సన్మానించారు. సచిన్‌తోపాటు బీసీసీఐ ఆఫీస్ అధికారుల చేతుల మీదుగా షఫాలీ సేనకు రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమం జరిగింది.