
ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఫాస్ట్ గా ముగించాలని కోరుకుంటుంది. సోమవారం అధికారికా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫారెన్ ప్లేయర్ల కమిట్ మెంట్ లను దృష్టిలో పెట్టుకొనే రానున్న షెడ్యూల్ లో ఎక్కువగా డబుల్ హెడ్డర్ మ్యాచ్ లు జరిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ లోని మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లను శుక్రవారం (మే 16) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఖచ్చితంగా రెండు వారాల్లో అనగా శుక్రవారం (మే 30) ఐపీఎల్ ఫైనల్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మంగళవారం (మే 13) ప్లేయర్లందరూ తమ తమ జట్లలో చేరాల్సి ఉంది. మ్యాచ్ లు ఎక్కడ జరుగుతాయనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ ల కోసం బీసీసీఐ మూడు వేదికలను సిద్ధం చేసినట్టు సమాచారం. మిగిలిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. పంజాబ్ కింగ్స్ సొంత వేదికలైన చండీగఢ్, ధర్మశాలలలో అనిశ్చిత పరిస్థితుల మధ్య లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు తటస్థ వేదిక కేటాయించబడే అవకాశం ఉంది.
మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్18వ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ పోరుమధ్యలోనే నిలిపివేసినా.. ఇరు జట్లకూ పాయింట్లు కే టాయించలేదు. ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య గురువారం (మే 7) మ్యాచ్ ప్రారంభమైంది.
🚨 IPL 2025 UPDATES 🚨
— SportsTiger (@The_SportsTiger) May 11, 2025
According to media reports, the BCCI is planning to extend the IPL season until May 30th. 🏏
With Chennai, Bengaluru & Hyderabad set to be the venues from May 16th, the excitement is building!
📅 The new schedule might be sent to franchises by Sunday… pic.twitter.com/QPEDEfg3pH