
దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోయాయి.. సాధారణ స్థితికి వచ్చింది. ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటలకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ 2025 సాధ్యమైనంత తొందరగా ప్రారంభించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. మొదట అనుకున్న సమయానికే అనగా మే 25 లోపు ఐపీఎల్ ముగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) బీసీసీఐ..ప్లేయర్లను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు తెలియజేసింది.
ఐపీఎల్ రీ స్టార్ట్ మే 15 లేదా మే 16 ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ పోరు మళ్ళీ మొదట నుంచి జరగడం ఖాయంగా మారింది. రోజుకు రెండు మ్యాచ్ లు జరిపితే వారం రోజుల్లో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ లో భాగంగా మరో నాలుగు మ్యాచ్ లు ఆరు రోజుల్లో ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా 12 లేదా 13 రోజుల్లో మిగిలిన ఐపీఎల్ టోర్నీ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ 11 నుండి లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్ళు సన్నద్ధం కావాల్సి ఉంది. మే 25 తర్వాత వారు ఉండడం అనిశ్చితంగా మారింది. ఈ కారణంగా మిగిలిన షెడ్యూల్‌లో మరిన్ని డబుల్ హెడర్‌లను కలిగి ఉండాలని భారత బోర్డు యోచిస్తోందని తెలుస్తోంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను వేదికలుగా భారత బోర్డు ఎంపిక చేసినట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్‌కు సొంత వేదికలైన చండీగఢ్, ధర్మశాలలలో అనిశ్చిత పరిస్థితుల మధ్య లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు తటస్థ వేదిక కేటాయించబడే అవకాశం ఉంది.
The BCCI has Asked Teams To reassemble by Tuesday! 😲 pic.twitter.com/DkQGvlXTgJ
— CRICKETNMORE (@cricketnmore) May 11, 2025