టీ20 వరల్డ్ కప్లో బుమ్రా ఆడటం లేదని ఎవరు చెప్పారు

టీ20 వరల్డ్ కప్లో బుమ్రా ఆడటం లేదని ఎవరు చెప్పారు

టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా వైదొలిగినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది.  టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంకా వైదొలగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. బుమ్రా ఆడతాడా...లేదా అన్న దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.  

నివేదిక తర్వాతే నిర్ణయం..
వెన్ను నొప్పితో సౌతాఫ్రికా టీ20 సిరీస్కు దూరమైన బుమ్రా.. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే బుమ్రా విషయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించాడు. 

బుమ్రా తప్పుకున్నట్లు వార్తలు..
ఆసీస్తో ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆడని బుమ్రా..ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఆడాడు. అయితే..బుధవారం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొదలు కాగా..మంగళవారం గా ప్రాక్టీస్ సెషన్‌లో వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్‌కు బుమ్రాను దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ తర్వాత బుమ్రాకు పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే ఇందుకు ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినా....4 నుంచి 6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతోనే అతను రెండో టీ20 ఆడేందుకు గౌహతికి వెళ్లలేదు. దీంతో అతను టీ20 వరల్డ్ కప్కు కూడా దూరమైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. 

ఆదివారం రెండో టీ20..
టీ20 వరల్డ్ కప్కు సన్నద్ధమవుతున్న టీమిండియా..ఇప్పటికే ఆసీస్ తో టీ20 సిరీస్ ఆడింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్లో భాగంగా ఇప్పటికే భారత జట్టు..దక్షిణాఫ్రికాపై మొదటి మ్యాచులో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది. గౌహతి ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇరు జట్లు  అస్సాం చేరుకున్నాయి.