
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి చాలా మంది ప్లేయర్లు అప్లికేషన్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జట్టు హెడ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు ఫిజియో, కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్క ప్రధాన కోచ్ పదవికే 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ పదవి రేసులో రావిశాస్త్రి తో పాటు కోచింగ్‌లో అత్యుత్తమ అనుభవమున్న ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టామ్‌మూడీతో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్, ప్రస్తుత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.
మరోవైపు భారత్ నుంచి రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్.. ఇద్దరే దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది BCCI. శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే మొదట ఈ పదవిపై ఆసక్తి చూపించినా… ఆ తర్వాత వెనక్కితగ్గాడు. దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ ఫీల్డింగ్ స్టార్ జాంటీరోడ్స్ భారత ఫీల్డింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపింది.
కొత్తగా ఏర్పాటైన క్రికెట్ పాలక మండలి.. త్వరలోనే ఈ దరఖాస్తులను పరిశీలించి కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.