
IPL 2025 రద్దు చేసింది బీసీసీఐ. ఇవాల్టి నుంచి.. అంటే 2025, మే 9వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని మ్యాచులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది బీసీసీఐ. ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం.. సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 సిరీస్ ను నిరవధికంగా వాయిదా చేస్తూ నిర్ణయం తీసుకున్నది బీసీసీఐ.
ఐపీఎల్ కోసం.. ఇతర దేశాల నుంచి ఎంతో మంది క్రికెటర్లు ఇండియా వచ్చారు. వారి భద్రత కూడా ఎంతో ముఖ్యం. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు, యుద్ధం వస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలపై ఓ వైపు మాక్ డ్రిల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచులకు భద్రత అనేది సవాల్ గా మారింది.
Also Read : ధర్మశాల మ్యాచ్ అహ్మదాబాద్‌కు
ఐపీఎల్ మ్యాచ్ లను ఉగ్రవాదలు, టెర్రిరస్టులు టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా క్రికెట్ మ్యాచుల కోసం లక్షల మంది సమూహంగా.. క్రికెట్ స్టేడియాల్లో ఉంటారు. ఇలాంటి యుద్ధ వాతావరణం క్రమంలో.. ఎదైనా జరగరానిది జరిగితే అది అతి పెద్ద విపత్తుగా మారే ప్రమాదం లేకపోలేదు. సెక్యూరిటీ కూడా భద్రతా దళాలకు, లోకల్ పోలీసులకు సవాల్ గా మారనుంది. లక్షల మంది క్రికెట్ స్టేడియాలకు రావటం.. విదేశీ ఆటగాళ్ల భద్రత అనేది.. ఇలాంటి యుద్ధ వాతావరణం సమయంలో పెను సవాల్. ఈ క్రమంలోనే.. ఐపీఎల్ మ్యాచులు అన్నింటినీ రద్దు చేసింది బీసీసీఐ.
IPL suspended indefinitely due to India-Pakistan military conflict: BCCI official
— Press Trust of India (@PTI_News) May 9, 2025