గీత దాటొద్దు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక

గీత దాటొద్దు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక

న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం యూఏఈ వెళుతున్న క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్స్ బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ఎన్నోఆటంకాలను అధిగమించిన తర్వాత సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుంది. అయితే ఇటీవల యూఏఈలో కరోనా విజృంభణ పెరిగింది. దీంతో అప్రమత్తమైన బోర్డు.. ప్లేయర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల వేరేవాళ్లు ఇబ్బంది పడకూడదని మా భావన. అందుకే ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఓనర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కరోనా ప్రొటోకాల్స్ ను బ్రేక్ చేయవద్దని చెప్పాం. ప్లేయర్ల సేఫ్టీకి అవసరమైన అన్ని వసతులను యూఏఈ మనకు ఏర్పాటు చేస్తోంది. కరోనా ముప్పు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ తిరగవద్దంటూ అందరికీ హెచ్చరికలు పంపాం’ అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.

యూఏఈ చేరిన మూడు జట్లు
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్–13 కోసం తొలి విడతగా కింగ్స్ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ గురువారం యూఈఏలో అడుగు పెట్టాయి. ముందుగా రాయల్స్, పంజాబ్ దుబాయ్ చేరుకున్నాయి. మరో స్పెషల్ ఫ్లైట్లో కేకేఆర్ సాయంత్రం అబుదాబిలో ల్యాండ్ అయింది. టోర్నీ కోసం ఆ జట్టు అబుదాబిలోనే బేస్ ఏర్పాటు చేసుకుంది. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం మధ్యాహ్నం 12.45 కు దుబాయ్ బయల్దేరుతుందని టీమ్ అఫీషియల్ ఒకరు చెప్పారు. ఇప్పటికే చెన్నైలో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్ క్యాంపులో ఐదు రోజుల నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ఈ క్యాంప్ కు దూరంగా ఉన్న సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నైతో కలిసి దుబాయ్ వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతను రెండు వారాలు ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. కాగా, యూఏఈ వెళ్లేముందే ప్లేయర్లకు పలుసార్లు కరోనా టెస్టులు చేశారు. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆరో రోజుల ఐసోలేషన్లో మరో ఒక్కో రోజు గ్యాప్లో మూడు సార్లు టెస్టులు చేయించుకుంటారు. అన్నింటిలో నెగెటివ్ వస్తేనే బయో బబుల్లో ట్రెయినింగ్ కు అనుమతిస్తారు.

For More News..

ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు

చిన్న పట్టణాలకు మారుతున్న పెద్ద కంపెనీలు