హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ సీట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తున్న ఖాళీల్లో బీజేపీ నుంచి11 సీట్లలో ఓసీలకు ఆరు, బీసీలకు 4, ఎస్టీలకు 1 కేటాయించిందని, కాంగ్రెస్ 7 సీట్లలో ఓసీలకు 4, ఎస్సీలకు రెండు, మైనార్టీలకు ఒకటి కేటాయించిందని, టీడీపీ మూడు సీట్లలో ఓసీ లకు రెండు, బీసీలకు ఒకటి కేటాయించిందని, ఇక జనసేన ఒక సీటు ఓసీలకు కేటాయించిందని గుర్తుచేశారు.
బీజేపీ బీసీలకు 4 సీట్లు కేటాయిస్తే, టీడీపీ ఒకటి కేటాయించడం, కాంగ్రెస్ 7 సీట్లలో ఒక్కటి కూడా బీసీలకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదన్నారు. రాజ్యసభ సీటు కేటాయింపులు ఒక్క సీటు అవకాశం వస్తే ఆ ఒక్క సీటును కూడా అగ్రకులాలకే కేటాయించారని ఆరోపించారు.
