- పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్
హైదరాబాద్సిటీ, వెలుగు: సమాజ చైతన్యంలో పత్రికలు సామాజిక గొంతుకగా ముందుకుసాగాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. డా. నోముల సిద్దూ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచికను బుధవారం హిమాయత్ నగర్ లో పీసీసీ చీఫ్ఆవిష్కరించారు. బీసీల చైతన్యంలో గౌడకంఠమ్ పాత్ర అభినందనీయమన్నారు.
బీసీలకు కాంగ్రెస్ పెద్ద పీఠ వేస్తోందన్నారు. గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు మోతె చక్రవర్తి గౌడ్, బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ , నాగరాజుపాల్గొన్నారు.
