డీసీసీ అధ్యక్షులుగా బీసీలకు పెద్ద పీట వేయాలి: దాసు సురేశ్

డీసీసీ అధ్యక్షులుగా బీసీలకు పెద్ద పీట వేయాలి: దాసు సురేశ్

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ప్రస్తుతం కొనసాగుతున్న డీసీసీ నియామకాల్లో 50 శాతం బీసీలకు అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని బీసీ జేఏసీ కో చైర్మన్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​ కాంగ్రెస్ ​పార్టీని కోరారు. 

సామాజిక న్యాయ సాధన కోసం 18న జరిగిన బంద్కు కాంగ్రెస్ కలిసిరావడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇదే తరుణంలో న్యాయస్థానాలతో  సంబంధం లేని పార్టీ పదవులను, అధికారిక పదవులను బీసీలకు అప్పజెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటో ప్రజలకు వివరించాలన్నారు.