వ్యాక్సిన్ కేంద్రాలకు జనం పోటెత్తుతారు జాగ్రత్త..

వ్యాక్సిన్ కేంద్రాలకు జనం పోటెత్తుతారు జాగ్రత్త..
  • టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ సూచన

హైదరాబాద్: ‘‘అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా వ్యాక్సిన్ వచ్చేసింది.. సంతోషం.. అయితే కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పోటెత్తకుండా చూస్కోండి.. ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే కేంద్రం నిర్దేశించిన గైడ్ లైన్స్ ప్రకారం వెంటనే తగిన జాగ్రత్త చర్యలతో రెడీగా ఉండండి..’’ అంటూ  చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను కలెక్టర్లతో సమీక్షించారు.  మొదటి దశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిజేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లoదరికి కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు. వాక్సినేషన్ ప్రారంభించే  కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్  ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా  ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే  తగు చర్యలు చేపట్టుటకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  కలెక్టర్లకు స్పష్టం చేశారు.

వాక్సినేషన్ ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతి కేంద్రoలో అన్ని ఏర్పాట్లను సమన్వయ పరిచేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్త గా వాక్సినేషన్‌ను రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. నెట్ వర్క్ ద్వారా  ముందుగా నిర్ణయించిన లబ్దిదారులను జిల్లా యంత్రాంగం చే వాక్సినేషన్ కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ వాక్సినేషన్ కు చాలా ప్రాదాన్యత ఉన్నందున ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. మొదటి రోజు కొద్దిమంది లబ్ధిదారులనే వాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే విదంగా చూచి, ఆ అనుభవాలను బట్టి  ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుండే లబ్ధిదారులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఇవీ చదవండి..

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాఖ