బెంగళూరులో ఇళ్ల అద్దె డిపాజిట్ల విషయంలో జరుగుతున్న గొడవలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చారు గుప్తా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు చాలా మంది దీన్ని బెంగళూరు డిపాజిట్ స్కామ్ అని పిలుస్తున్నారు.
ఎం జరిగిందంటే... చారు గుప్తా అనే యువతి బెంగళూరులో మరో ఇద్దరితో కలిసి ఒక 3BHK ఫ్లాట్‌లో అద్దెకు ఉంటోంది. ఆమె తన వంతుగా రూ.70వేలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టింది. అయితే, ఇంటి ఓనర్ ఫ్లాట్‌ను అమ్మేయాలని అనుకుంటున్నానని, ఇల్లు ఖాళీ చేయమని అడిగాడు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత, ఓనరుకి ఆమె ఇచ్చిన రూ.70,000 డిపాజిట్‌లో కేవలం రూ.18,000 మాత్రమే తిరిగి ఇచ్చాడు.
ఇదేంటని షాకైన యువతీ... ఇల్లు ఖాళీ చేసిన తర్వాత రిపేర్లు జరుగుతున్నాయని, ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల తనకు వచ్చే అద్దె నష్టాన్ని కూడా అద్దెదారులే భరించాలని ఓనర్ ఒక నెల అద్దెను డిపాజిట్ నుండి కట్ చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న రిపేర్లు మేము రాకముందే ఉన్నాయని, అవి ఓనరుకి కూడా తెలుసని ఆమె అంటోంది. పెయింటింగ్, రిపేర్ల పేరుతో ఇలా భారీగా డబ్బులు వసూల్ చేయడం పై ఆమె మండిపడుతోంది.
ఆ ఓనరుకి బెంగళూరులో దాదాపు 10 ఫ్లాట్లు ఉన్నాయని, అంత ఉన్న కూడా ఇలా చేయడం ఏంటని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం ఓనర్ ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. మొత్తం ముగ్గురు కలిపి రూ.2.4 లక్షల డిపాజిట్ ఇస్తే, అందులో రూ.1.6 లక్షలు ఓనర్ రిటర్న్ ఇవ్వలేదని ఆమె పోస్ట్‌లో పేర్కొంది. దీనిపై లీగల్ నోటీసు పంపామని, 15 రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని ఆమె స్పష్టం చేసింది.
ALSO READ : గాలి నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. చైనా స్టార్టప్ సరికొత్త ఆవిష్కరణ
ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ. ఒక 3BHKకి పెయింటింగ్ వేయించాలన్నా 30 వేల వరకు అవుతుంది. అగ్రిమెంట్‌లో ఇవన్నీ ముందే రాసి ఉంటాయి, సంతకం చేసేముందే చూసుకోవాలి అని కొందరు అంటున్నారు.
చాలా మంది ఓనర్లు డిపాజిట్ తిరిగి ఇవ్వడానికి ఇలాగే సాకులు చెబుతారు. అందుకే వెళ్లేటప్పుడు చివరి 3-4 నెలల అద్దె కట్టకుండా డిపాజిట్‌లో అడ్జస్ట్ చేసుకోమని చెప్పడమే సేఫ్ అని మరికొందరు సలహా ఇస్తున్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో అద్దెకు ఉండేవారు అగ్రిమెంట్ పేపర్లను ముందుగా జాగ్రత్తగా చదవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
