తెలంగాణ బడ్జెట్ 2026-27 లో హైదరాబాద్ నగరానికి సున్నా నిధులు కేటాయించడం బాధకరమన్నారు టీ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. గత ఏడాది బడ్జెట్ కు , ఈ బడ్జెట్ కు పెద్ద తేడాలేదు.. GHMC ని మూడు ముక్కలుగా విడగొట్టారు. నిధులు మాత్రం కేటాయించడం లేదు.. అభివృద్ది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మైనార్టీలకు నిధులు కేటాయించారు.. మిగతా వాళ్లు ఏం పాపం చేశారని నిలదీశారు రామచందర్ రావు.
ఎడ్యుకేషన్ ను కూడా ఈ బడ్జెట్ లో నిధులు తక్కువ కేటాయించారు కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించారు.. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువన్నారు రామచందర్ రావు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదు సార్లు రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా మూడో బడ్జెట్ తర్వాత కూడా ప్రజలకు చెవిలో పువ్వు పెట్టారని విమర్శించారు. ఐదు వందల గ్యాస్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయన్నారు. టెంపుల్ లో పని చేసే అర్చకుల వేతనాలు, ధూప దీప నైవేద్యానికి సంబంధించి బడ్జెట్ లో ఎక్కడ మాట్లాడలేదు.. గుడులకు సంబంధించిన బడ్జెట్ ఎక్కడ లేదని అన్నారు. ప్రజలను నిరాశ పర్చిన ఈ బడ్జెట్ ఒక ఫాల్స్ ఫెయిల్డ్, మోసపూరిత బడ్జెట్ అని రామచందర్ అన్నారు.
