తెలంగాణ బడ్జెట్ : ఇచ్చిన హామీలకు నిధులెక్కడ.. బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి

తెలంగాణ బడ్జెట్ : ఇచ్చిన హామీలకు నిధులెక్కడ.. బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి

తెలంగాణ బడ్జెట 2026-27 పై బీఆర్ ఎస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ లో ఇచ్చిన హామీలు, పథకాలకు నిధులు మరిచి స్కాములకు తెరలేపారని విమర్శించారు. ఈ బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పూలు పెట్టారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రభుత్వ డొల్లతనం మొత్తం బయటపడిందని అన్నారు. దళితుల బడ్జెట్ ను కుదించారని , దళితులను మోసం చేశారని రాబోయేరోజుల్లో బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ ను   గద్దెదించడం ఖాయమని బీఆర్ ఎస్ నేతలు అన్నారు.   

తెలంగాణ బడ్జెట 2026-27 పై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలకు నిధులు కేటాయించకుండా  వారి గొంతు కోశారని విమర్శించారు. బడ్జెట్లో కళ్యాణలక్ష్మీకి తులం బంగారం ఊసేలేదన్నారు బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాశారని ఆరోపించారు. 

ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు అసలే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రస్తావన అసలే లేదన్నారు. మహిళలకు ఇచ్చిన 2500 హామీ ఉసే లేదన్నారు. ఉత్తదే అంకెలు వేసి బడ్జెట్ పొందుపరిచారని విమర్శించారు జగదీష్ రెడ్డి. 

మరో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకనంద్ గౌడ్  మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో  అన్ని వర్గాల ప్రజల చెవిలో ప్రభుత్వం పూలు పెట్టిందన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా హైదరాబాద్ లో నే ఉంటుందని చెప్పి, బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు.