Punjab Kings: ఐపీఎల్ నుంచి లాకీ ఫెర్గూసన్ ఔట్.. షాక్లో పంజాబ్ కింగ్స్ టీమ్

Punjab Kings: ఐపీఎల్ నుంచి లాకీ ఫెర్గూసన్ ఔట్.. షాక్లో పంజాబ్ కింగ్స్ టీమ్

Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ19వ సీజన్ కి ముందే కొంతమంది స్టార్ ప్లేయర్లు టోర్నీ మొత్తానికి లేదా కొన్ని మ్యాచ్‌లకు మిస్ అవుతూ జట్ల కాంబినేషన్‌ను ప్రభావితం చేస్తున్నారు. ఈసారి ఆ జాబితాలో మరో పేరు చేరింది, అది గత సంవత్సరం రన్నర్స్-అప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టును పెద్దగా ప్రభావితం చేస్తుంది. వ్యక్తిగత సమస్య కారణంగా న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గుసన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయం పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

లాకీ ఫెర్గుసన్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌లోని మొదటి 7 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. కొంత సమయం క్రికెట్ నుంచి విరామం తీసుకుని, కుటుంబంతో గడపటానికే ఐపీఎల్ 2026 నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  అతడికి కొద్ది రోజుల క్రితం కొడుకు పుట్టాడు.. ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని, భార్యకు సాయంగా ఉండనున్నాడు. ఐపీఎల్ సెకండ్ ఆఫ్ కి ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. కాగా, ఓవర్సీస్ ప్లేయర్ ఆక్షన్ తర్వాత కూడా టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటే, రెండు సంవత్సరాల వరకు బ్యాన్ విధించబడుతుంది. ఈ నియమం గత సంవత్సరం హ్యారీ బ్రుక్‌పై వర్తించింది. 

అయితే, లాకీ ఫెర్గుసన్ ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే దూరం కానున్నాడు. కాబట్టి, అతనికి ఈ శిక్షకు అనర్హుడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగానికి పెద్ద సవాలు ఎదురుకానుంది. లాకీ ఫెర్గుసన్ రెండవ హాఫ్‌లో జట్టుతో చేరగానే సమతౌల్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా పంజాబ్ కింగ్స్ జట్టు మార్చి 31వ తేదీ గుజరాత్ టైటాన్స్ టీమ్ తో తమ తొలి పోరులో తలపడనుంది.