IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే పోరుతో ఈ లీగ్ స్టార్ట్ కానుంది. ఈ సీజన్ అనంతరం కొందరు స్టార్ ఆటగాళ్లు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తుంది. ఆ దిగ్గజ ప్లేయర్స్ ఎవరు అనేది ఇప్పుడు మనం వీ6 తెలుగు వార్తలో తెలుసుకుందాం..
మహేంద్ర సింగ్ ధోని
ఐపీఎల్ చరిత్రలో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎంఎస్ ధోనికి పేరుంది. ఇప్పటికే సీఎస్కేకి ఐదు ట్రోఫీలు అందించిన ఘనత దక్కింది. కాగా వయస్సు రీత్యా ఆయనకి ఇదే చివరి సీజన్ కావచ్చని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో మహేంద్రుడు, మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, చెన్నై జట్టు కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. జూలై 7వ తేదీతో అతడి 45 ఏళ్ళు నిండుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోని ఈ సీజన్ మొత్తం ఆడతారని తేల్చి చెప్పారు.. కానీ ఏ రోల్ లో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అజింక్య రహానే
అద్భుతమైన టెక్నీక్ కలిగిన బ్యాటర్ అజింక్య రహానే కూడా ఈ సీజన్ తర్వాత టోర్నీకి గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న అతడు, జూన్ 6వ తేదీతో 38వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ లీగ్ తర్వాత కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
ALSO READ : సన్‌రైజర్స్ హైదరాబాద్కి బిగ్ షాక్.. టోర్నీ నుంచి మరో ప్లేయర్ ఔట్!
సునీల్ నరైన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న సునీల్ నరైన్. ఇప్పటి వరకు ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టుని ముందుకు నడిపించాడు. బౌలింగ్ లో 192 వికెట్లు, బ్యాటింగ్ లో 1,780 పరుగులతో నరైన్ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ స్టార్ ప్లేయర్ ప్రస్తుత వయస్సు37 ఏళ్లు.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతడు.. ఫిట్ నెస్ సవాళ్ల దృష్ట్యా ఈ ఐపీఎల్ అనంతరం టోర్నమెంట్ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు టాక్.
ఇషాంత్ శర్మ
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 37 ఏళ్ల వయస్సు కలిగిన ఇషాంత్ గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. యంగ్ ఫాస్ట్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఉండటంతో ఐపీఎల్ 2026 తన కెరీర్ చివరిది కావొచ్చని అంచనా.
మిచెల్ స్టార్క్
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్నాడు. కేవలం టెస్ట్, వన్డే ఫార్మాట్ లోనే కొనసాగుతున్నాడు. కాగా ఈ ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వర్క్ లోడ్ తగ్గించుకోవడంలో భాగంగా ఈ సీజన్ లో జరిగే ప్రారంభ మ్యాచులకు దూరం కావడంతో పాటు టోర్నీ ముగిసి తర్వాత మొత్తం లీగ్ నుంచే తప్పుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ ఐదు ప్లేయర్స్ తమ లాస్ట్ సీజన్ లో ట్రోఫీని అందుకుని లీగ్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.
