మాసివ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌కు రెడీగా ఉండండి : నితిన్

మాసివ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌కు రెడీగా ఉండండి  : నితిన్

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్‌‌‌‌ట్రా‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఆర్డినరీ మ్యాన్‌‌‌‌’. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. నితిన్‌‌‌‌ జూనియర్ ఆర్టిస్ట్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటిస్తుండగా, తనకు జంటగా శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం శంషాబాద్‌‌‌‌లో వేసిన సెట్‌‌‌‌లో మూడు వందలకు పైగా డాన్సర్స్‌‌‌‌తో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘మాసివ్‌‌‌‌ ట్రీట్‌‌‌‌కు రెడీగా ఉండండి’ అంటూ శ్రీలీలతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో క్లిప్‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు 

నితిన్. జానీ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌తో షూటింగ్‌‌‌‌ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంట‌‌‌‌ర్‌‌‌‌టైన‌‌‌‌ర్‌‌‌‌కు సంబంధించి ఇప్పటికే రెండు పాటలతో పాటు టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. శ్రేష్ఠ్ మూవీస్‌‌‌‌, ఆదిత్య మూవీస్ బ్యానర్స్‌‌‌‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 8న విడుదల కానుంది.