Twitter : ఏప్రిల్ 1 నుంచి బ్లూ టిక్ మార్క్ తొలగింపు

Twitter : ఏప్రిల్ 1 నుంచి బ్లూ  టిక్  మార్క్ తొలగింపు

ట్విటర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక  నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు ఎలాన్ మస్క్. ఉద్యోగాల తొలిగింపు, బ్లూటిక్ అంశంలో ఆయన  ఇప్పటివరకు ఎక్కువగా వార్తల్లో నిలిచారు.  వెరిఫికేషన్ మార్క్ ను ప్రీమియం చేసిన ట్విట్టర్... ప్రస్తుతం యూజర్ల అకౌంట్లకు ఉన్న  బ్లూటిక్ ను (లెగసీ వెరిఫికేషన్ ) తొలిగించనుంది. ఏప్రిల్ 1 నుండి ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఇకపై బ్లూటిక్ వెరిఫికేషన్ కావాలంటే ట్విట్టర్ బ్లూకు  సబ్ స్కైబ్ ప్రీమియం చెల్లించాల్సాందేనని స్పష్టం చేసింది. దీనికి సంవత్సరానికి  రూ. 9,400 చెల్లించాలని తెలిపింది. 

బ్లూ చెక్ మార్క్ వల్ల యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయి. ట్వీట్లలో ప్రాధాన్యం, తక్కువ యాడ్స్, లాంగ్ ట్వీట్స్, బుక్ మార్క్ ఫోల్డర్స్, కస్టమ్ నావిగేషన్, ఎడిట్ ట్వీట్, అన్ డూ ట్వీట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో వ్యక్తిగత ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్స్ వెబ్‌పై 8 డాలర్లు ఉంది. యాప్‌లో నెలకు 11 డాలర్లు ఉంది.  ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 4,000 క్యారెక్టర్ల వరకు ఉండే లాంగ్ ట్వీట్లు చేయవచ్చు. ఇతరులతో పోలిస్తే 50 శాతం మాత్రమే యాడ్స్ ప్లే అవుతాయి. కంపెనీలు, బ్రాండ్ల అధికారిక ఖాతాలకు గోల్డ్ చెక్ మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ చెక్ మార్క్ ఉంటుంది. నెలకు 1,000 డాలర్లు చెల్లించాలని ట్విట్టర్ వ్యాపార సంస్థలను కోరింది. లేకుంటే గోల్డ్ బ్యాడ్జెస్ తొలగిస్తామని హామీ ఇచ్చింది.

ఇక ట్విట్టర్ ఇటీవలే గోల్డ్ (Gold), గ్రే (Grey), బ్లూ (Blue) అనే మూడు విభిన్న రంగులతో ఖాతాలను ధృవీకరించడానికి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దాని ద్వారా కంపెనీలకు గోల్డ్ చెక్‌మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే చెక్‌మార్క్, ప్రముఖులు లేదా నాన్-సెలబ్రిటీలకు బ్లూ చెక్‌మార్క్‌ను ట్విట్టర్ అందిస్తోంది. బ్రాండ్‌లు, సంస్థలు బ్లూ మార్కు కోసం "వెరిఫైడ్ ఫర్ ఆర్గనైజేషన్స్" ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంటుంది. ఇందుకు వారు నెలకు 1,000 డాలర్లు ఎక్కువ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.