ఎలుగుబంటిని చూసి పరుగులు తీసిన గ్రామస్తులు

ఎలుగుబంటిని చూసి పరుగులు తీసిన గ్రామస్తులు

మహారాష్ట్ర : అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి ఊరులోకి ఎంటర్ కావడమే కాకుండా ఓ ఇంట్లోకి వచ్చింది. ఇంకేముందు అది చూసిన ఇంట్లోవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గేటు లోపటికి వచ్చి కిటికీలో నుంచి తొంగి చూసింది. గమనించిన వారు వెంటనే డోర్ పెట్టేసి కేకలు వేశారు. గ్రామస్థులను చూసి ఎలుగుబంటి పరుగులు తీసింది. దాన్ని చూసి ఊరిలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సభ్యులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని రిస్క్ చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం మహారాష్ట్రలోని చంద్రపూర్ గ్రామంలో జరిగింది. వేసవికావడంతో అడవిలో నీరు దొరకక జంతువులు అయోమయం అవుతున్నాయని..బహుశా నీటికోసమే ఊరిలోకి ఏలుగుబంటి వచ్చి ఉంటుందని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. ఏలుగుబంటిని బంధించిన అధికారులు దానికి నీరు పట్టించి, తర్వాత అడవిలో వదిలేశారు.