రేపే బీటింగ్ రిట్రీట్ సెర్మనీ

రేపే బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
  • మొదలైన రిహార్సల్స్
  • హాజరు కానున్న రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు

ఈ నెల 26న మొదలైన రిపబ్లిక్ డే సంబరాలు రేపు ముగియనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా జనవరి 29న ఈ ముగింపు ఉత్సవాలను బీటింగ్ రిట్రీట్ సెర్మనీ పేరుతో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకల రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రతీ ఏడాది బ్యాండ్ టీంల ప్రదర్శన ఉంటుంది. కానీ ఈ సారి బ్యాండ్ టీంల ప్రదర్శనతో పాటు డ్రోన్ల ప్రదర్శన స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనుంది. వందలాది డ్రోన్లతో ఆకాశంలో దేశ మ్యాప్, మేకిన్ ఇండియా లోగోతో పాటు పలు రూపాలను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నాయి. దేశాధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, అధికారులు, పెద్ద సంఖ్యలో జనం ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. 1950లో మేజర్ రాబర్ట్స్ బీటింగ్ రిట్రీట్ సెర్మనీకి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రీజినల్ భద్రత సాధిద్దాం

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్